Vishal: వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నకు విశాల్ ఆసక్తికర సమాధానం!

Vishal response on marriage

  • ప్రభాస్ పెళ్లి అయిన వెంటనే తాను పెళ్లి చేసుకుంటానంటూ విశాల్ చమత్కారం
  • వివాహం ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని వ్యాఖ్య
  • పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే ఉందని వెల్లడి

సినీ హీరో విశాల్ పెళ్లి ఎంగేజ్ మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ అభినయతో ఆయన ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదైనా పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న విశాల్ కు మీడియా నుంచి ఎదురైంది. ప్రభాస్ పెళ్లి చేసుకున్న వెంటనే తాను పెళ్లి చేసుకుంటానని దీనికి సమాధానంగా సరదాగా చెప్పాడు. 

వివాహం ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని... పెళ్లి అంటే జోక్ కాదని అన్నారు. వృత్తి పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నామో వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండాలని చెప్పారు. నటుడిగా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయని తెలిపాడు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ ప్రస్తుతం తాను సినిమాలపైనే దృష్టిని కేంద్రీకరించానని చెప్పాడు.

Vishal
Prabhas
Marriage
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News