Pooja Hegde: చేదు అనుభవాలు చూసిన పూజ హెగ్డే .. కొత్త ఏడాదిపైనే ఆశలు!

Pooja Hegde Special

  • ఈ ఏడాదిలో పూజ హెగ్డే నుంచి వచ్చిన భారీ సినిమాలు 
  • పాన్ ఇండియా స్థాయిలో నిరాశపరిచిన ఫలితాలు
  • పూజ హెగ్డేను ఈ ఏడాది కంగారు పెట్టేసినట్టే 
  • ఇక కొత్త ప్రాజెక్టులపైనే ఆమె దృష్టి  

ఇటు దక్షిణాదిన .. అటు ఉత్తరాదినగల నాజూకైన భామలలో పూజ హెగ్డే ఒకరిగా కనిపిస్తుంది. 'దువ్వాడ జగన్నాథం' సినిమా నుంచి పూజ హెగ్డే తన సక్సెస్ గ్రాఫ్ ను పరుగులు పెట్టించింది. స్టార్ డమ్ ను పెంచుకుంటూ వెళ్లింది. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంది. ఆమె పారితోషికాన్ని గురించిన వార్తలు షికారు చేశాయి. 

ఈ ఏడాది వరకే తీసుకుంటే ఒకానొక దశలో ఆమె చేతిలో ప్రభాస్ .. విజయ్ .. చరణ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి చెందినవి కావడం విశేషం. ఆమె జోరు చూసి స్టార్ హీరోయిన్స్ సైతం కుళ్లుకున్నారు. ఈ సినిమాలు విడుదలైతే కొన్నేళ్లవరకూ పూజ డేట్స్ దొరకడం కష్టమేననే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. 

అయితే ప్రభాస్ తో చేసిన 'రాధే శ్యామ్' ..  చరణ్ జోడీ కట్టిన 'ఆచార్య' .. విజయ్ సరసన ఆడిపాడిన 'బీస్ట్' సినిమాల ఫలితం నిరాశపరిచింది. మూడు పెద్ద సినిమాలు చాలా తక్కువ గ్యాపులో పరాజయాన్ని చవిచూడటం పూజ హెగ్డేను కంగారు పెట్టేసింది. ఆమె కోలుకోవడానికి కొంత సమయం పట్టేసింది. ఇక ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు వచ్చే ఏడాదిలో థియేటర్లకు రానున్నాయి. ఆ సినిమాలపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది .. మరి అవేం చేస్తాయో చూడాలి.

More Telugu News