CM Ramesh: అమిత్ షాతో భేటీ అయిన సీఎం రమేశ్

CM Ramesh meets Amith Shah

  • పార్లమెంటులో అమిత్ షా కార్యాలయంలో కలిసిన సీఎం రమేశ్
  • ఏపీ రాజకీయ పరిస్థితులు, జగన్ పాలనపై వివరించిన ఎంపీ
  • 40 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ భేటీ అయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలోని అమిత్ షా కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జగన్ పాలన గురించి అమిత్ షాకు సీఎం రమేశ్ వివరించినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందనే విషయంపై అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది. 

మరోవైపు, ఏపీలో బలపడేందుకు బీజేపీ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖకు వచ్చినప్పుడు కూడా పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ ఇదే దిశగా మార్గ నిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని, లేనిపక్షంలో అవకాశాన్ని ఇతర పార్టీలు అందిపుచ్చుకుంటాయని మోదీ అన్నారు.

CM Ramesh
Amit Shah
BJP
Jagan
  • Loading...

More Telugu News