Cisco: ఇతర టెక్ సంస్థల బాటలో సిస్కో... 4 వేల ఉద్యోగాలకు కత్తెర!

Cisco decides to cut off thousands of jobs

  • ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న టెక్ సంస్థలు
  • ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యం
  • గత నెలలోనే నిర్ణయం తీసుకున్న సిస్కో

ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అదేమంటే... ఖర్చులను తగ్గించుకోవడానికి ఇలాంటి నిర్ణయాలు తప్పడం లేదంటున్నాయి. అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, లెనోవో, అడోబ్, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు చివరి జీతం ఇచ్చి పంపించివేశాయి. 

తాజాగా, అమెరికా టెక్ దిగ్గజం సిస్కో కూడా ఇదే బాటలో నడుస్తోంది. 4 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. గత నెలలోనే సిస్కో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించనుంది. 

ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత సాధించడం కోసమే సిస్కో ఈ నిర్ణయం తీసుకుందని ఓ బిజినెస్ మ్యాగజైన్ పేర్కొంది.

More Telugu News