Adivi Sesh: అడివి శేష్ ను గురించి నేను చెప్పేమాట ఇదే: మీనాక్షి చౌదరి

Meenakshi Choudary Interview

  • ఇటీవలే థియేటర్స్ కి వచ్చిన 'హిట్ 2'
  • తన కెరియర్లో ఫస్టు హిట్ అని చెప్పిన మీనాక్షి
  • అడివి శేష్ హార్డ్ వర్కర్ అంటూ కితాబు
  • 'ఖిలాడి' గురించిన ప్రస్తావన 
  • రవితేజ ఎనర్జీ వేరే లెవెల్ అని వెల్లడి

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి ఒకరు. 'ఖిలాడి' తరువాత పెద్దగా గ్యాప్ లేకుండానే 'హిట్ 2' సినిమాతో వచ్చిన మీనాక్షి హిట్ కొట్టేసింది. తెలుగులో ఆమెకి పడిన ఫస్టు హిట్ సినిమా ఇదే. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను ఆమె పంచుకుంది. 

"ఈ సినిమా జనంలోకి వెళ్లినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏడాది చివరలో హిట్ పడినందుకు ఆనందంగా ఉంది. రవితేజతో 'ఖిలాడి' చేసినప్పుడు, సెట్స్ లో ఆయన చాలా యాక్టివ్ గా ఉండటం గమనించాను. షూటింగుకి వచ్చేటప్పుడు .. వెళ్లేటప్పుడు కూడా ఆయన అంతే ఎనర్జీతో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది" అని అంది. 

"అడివి శేష్ విషయానికి వస్తే తను వండర్ఫుల్ పర్సన్. ఆయన చాలా హార్డ్ వర్కర్ .. ప్రతి చిన్న విషయంలోను ఎంతో కేర్ తీసుకుంటాడు. నా పాత్రను నేను అంత బాగా చేయడం వెనుక ఆయన సపోర్టు ఎంతో ఉంది. ఈ సినిమాకి సంబంధించి నేను నానీ గారికీ .. అడివి శేష్ గారికి .. శైలేశ్ కొలనుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి" అంటూ చెప్పుకొచ్చింది.

Adivi Sesh
Meenakshi
Raviteja
  • Loading...

More Telugu News