Oval Cricket Ground: ఓవల్ క్రికెట్ స్టేడియంను కప్పేసిన మంచు.. వీడియో ఇదిగో!

Oval cricket ground filled with snow

  • లండన్ లో మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • ఓవల్ స్టేడియంలో రెండు అడుగుల మేర కప్పేసిన మంచు
  • ఐస్ హాకీ ఆడుకోవచ్చంటున్న నెటిజెన్లు

చలి ఇండియానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తోంది. బ్రిటన్ లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. లండన్ లో మైనస్ 10 నుంచి మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. విపరీతమైన మంచు కురుస్తోంది. ఈ క్రమంలో లండన్ లోని ప్రఖ్యాత ఓవల్ క్రికెట్ గ్రౌండ్ లో మంచు దుప్పటి కప్పుకుంది. మైదానంలో రెండు అడుగుల మేర మంచు కప్పేసింది. 

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసి నెటిజెన్లు పరవశించిపోతున్నారు. దీన్ని చూస్తే క్రికెట్ గ్రౌండ్ అని ఎవరూ అనుకోరని కొందరు అంటున్నారు. క్రికెట్ కాకుండా ఐస్ హాకీ ఆడుకుంటే బాగుంటుందని మరికొందరు అన్నారు. 1845లో నిర్మితమైన ఓవల్ మైదానంలో 1880లో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో రెండో టెస్ట్ మ్యాచ్ జరిగిన స్టేడియంగా ఓవల్ కు గుర్తింపు ఉంది.

Oval Cricket Ground
Snow

More Telugu News