Inaya: హౌస్ నుంచి సూర్య వెళ్లిపోతే ఎలా అనిపించిందంటే ..!: ఇనయా

Inaya Interview

  • బిగ్ బాస్ లో హాట్ టాపిక్ గా నిలిచిన సూర్య - ఇనయా 
  • సూర్యను నామినేట్ చేసిన ఇనయా 
  • తన వలన అతను వెళ్లిపోలేదని ఇనయా వ్యాఖ్య 
  • సూర్య తన క్రష్ అని అతనితో తాను అనలేదని వివరణ   

బిగ్ బాస్ హౌస్ లో ఇనయా - సూర్య ఇద్దరూ కూడా చాలా సాన్నిహిత్యంతో ఉండేవారు. చనువుతో మాట్లాడుకునేవారు. దాంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే టాక్ బయట బాగా వినిపించింది. దానికి తగినట్టుగానే సూర్య హౌస్ నుంచి వెళ్లిపోయిన తరువాత అతని కాఫీ కప్పును ఇనయా ఉపయోగించడం .. ఆ కప్పును దాచేస్తే ఆమె ఫైర్ కావడం చేసింది.

ఆదివారం రోజున బయటికి వచ్చిన ఇనయా, బీబీ కేఫ్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. సూర్యతో చనువు గురించిన ప్రశ్నకు ఇనయా స్పందిస్తూ .. "బిగ్ బాస్ హౌస్ లో మూడో వారం నుంచి నాతో సూర్య చనువుగా మాట్లాడేవాడు. ఆయన నా క్రష్ అని నేను నేరుగా చెప్పలేదు. సూర్యపై కోపం వచ్చినప్పుడే ఆయన గురించి రేవంత్ తో చెప్పవలసి వచ్చింది" అంది. 

సూర్యతో చనువుగా ఉంటూ ఆయనను నామినేట్ చేయడం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. నేను ఒక్కదాన్ని నామినేట్ చేయడం వల్లనే సూర్య వెళ్లిపోయాడని నేను అనుకోవడం లేదు. మిగతావాళ్లు కూడా ఆయనను నామినేట్ చేశారు. ఆయన వెళ్లిపోయిన తరువాత మాత్రం బాధేసింది .. ఏడుపు వచ్చేసింది" అంటూ చెప్పుకొచ్చింది.

Inaya
Surya
Srihan
Revanth
Bigg Boss
  • Loading...

More Telugu News