Raghu Rama Krishna Raju: అనంతబాబు మా పార్టీ వాడు కాబట్టి కాపాడుకున్నాం: రఘురామకృష్ణరాజు

Raghu Rama Krishna Raju comments on Anantha Babu bail

  • ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • ప్రభుత్వం ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడంతో బెయిల్ ఇచ్చిందన్న రఘురాజు
  • తమ పార్టీవాళ్లు ఏం చేసినా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఉంటారని వ్యాఖ్య

డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులను కింది కోర్టు విధించాలని ఆదేశించింది. ఛార్జ్ షీటును రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ఉపసంహరించుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అనంతబాబుకు బెయిల్ మంజూరు కావడంపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. 

అనంతబాబు తమ పార్టీ వాడు కాబట్టే కాపాడుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడంతో సుప్రీంకోర్టు డీఫాల్ట్ బెయిల్ ఇచ్చిందని అన్నారు. తమ పార్టీలో వాళ్లు హత్యలు చేసినా, ఇంకేమైనా చేసిన కాపాడటానికి తమ ప్రభుత్వ పెద్దలు ఉంటారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని... కార్పొరేషన్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.

Raghu Rama Krishna Raju
Anantha Babu
Supreme Court
Bail
YSRCP
  • Loading...

More Telugu News