Bhupendra Patel: గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

Bhupendra Patel takes as CM of Gujarat

  • వరుసగా రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర
  • మంత్రులుగా ప్రమాణం చేసిన 16 మంది ఎమ్మెల్యేలు
  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మోదీ, అమిత్ షా

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గాంధీనగర్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. భూపేంద్ర చేత గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ రత్ ప్రమాణం చేయించారు. ఇదే సమయంలో 16 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఎక్కువ మంది గత ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉన్నవారే. మరోవైపు ప్రమాణస్వీకార కార్యక్రమానికి 200 మంది సాధువులు కూడా హాజరయ్యారు. సీఎం భూపేంద్ర ఈ ఎన్నికల్లో 1.92 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడం ఇది వరుసగా రెండోసారి.

Bhupendra Patel
Chief Minister
Gujarat
Oath
  • Loading...

More Telugu News