Inaya: బిగ్ బాస్ హౌస్ నుంచి ఇనయా ఔట్ .. విన్నర్ గా ఎవరు నిలవాలని కోరుకుందంటే ..!

Bigg Boss 6  Update

  • బిగ్ బాస్ హౌస్ కి గ్లామర్ తెచ్చిన ఇనయా 
  • ఆమె ధోరణి పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన హౌస్ మేట్స్ 
  • వాళ్లందరినీ మెప్పిస్తూ వచ్చిన ఇనయా
  • విన్నర్ గా శ్రీహాన్ ను చూడాలని ఉందని వెల్లడి 

బిగ్ బాస్ హౌస్ లో గ్లామరస్ గా మెరిసిన అమ్మాయిలలో ఇనయా ఒకరు. హౌస్ లో ఆమె తనదైన ఆటతీరును కనబరుస్తూ వచ్చింది. ప్రతి చిన్న విషయానికి వాదన చేస్తుందనే ఉద్దేశంతో ఇంటి సభ్యులంతా ఆమెను దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆమెను ఒంటరిని చేసి నామినేట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అయినా ఆమె వాటిని తట్టుకుంటూ వచ్చింది. అలాంటి ఇనయా నిన్న ఎలిమినేట్ అయింది. 

ఇనయా ప్రతి అంశాన్ని రచ్చ చేస్తుందని ఫిర్యాదులు చేసిన హౌస్ మేట్స్ నోటి నుంచే, తను మారిపోయిందని చెప్పే పరిస్థితిని తీసుకుని వచ్చింది. అందరూ కలిసి ఆమె కెప్టెన్సీని అభినందించే స్థాయికి చేరుకుంది. ఇదంతా చూసి ఇనయా టాప్ ఫైవ్ కి వెళుతుందని అనుకున్నవారు లేకపోలేదు. కానీ ఆమె బయటకి వచ్చేయవలసి వచ్చింది. అందరూ కూడా భారమైన మనసుతోనే ఆమెకి వీడ్కోలు చెప్పడం విశేషం. 

స్టేజ్ ఉన్న నాగార్జున దగ్గరకి ఆమె వచ్చింది. ఆ సమయంలో ఆమె తన తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయింది. హౌస్ మేట్స్ గురించి చెప్పమని నాగార్జున అడిగితే, ఆమె చాలా బోల్డ్ గానే సమాధానాలు ఇచ్చింది. శ్రీహాన్ కి మనిషి వెనుక మాట్లాడే అలవాటు ఉందనీ, అతను మానుకోవలసింది అదేనని అంది. అతను విన్నర్ గా నిలవాలని కోరుకుంటున్నట్టుగా చెప్పింది. తాను ఇంకొక్కవారం హౌస్ లో ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Inaya
Revanth
Sri Sathya
Srihan
Bigg Boss
  • Loading...

More Telugu News