Uttar Pradesh: ఆహారంలో తలవెంట్రుక వచ్చిందని.. భార్యకు గుండుకొట్టించాడు!

UP Man shaves wife head after finding hair strand in food

  • ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఘటన
  • కుటుంబ సభ్యుల ముందే భార్యకు గుండుకొట్టించిన భర్త
  • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్

ఆహారంలో వెంట్రుక వచ్చిందని భార్యకు గుండు కొట్టించాడో భర్త. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా మిలాక్ గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జహీరుద్దీన్-సీమాదేవి (30) భార్యాభర్తలు. ఏడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. శుక్రవారం రాత్రి సీమాదేవి తన భర్తకు ఆహారం వడ్డించింది. అది తింటుండగా మధ్యలో వెంట్రుక కనిపించడంతో జహీరుద్దీన్ ఆగ్రహానికి గురయ్యాడు. కుటుంబ సభ్యుల ముందే భార్యకు గుండుకొట్టించాడు. 

ఈ అవమానాన్ని భరించలేని సీమాదేవి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందని తనకు గుండుకొట్టించాడని, అంతేకాకుండా రూ. 15 లక్షల కట్నం తీసుకురావాలని పెళ్లయినప్పటి నుంచి అత్తింటివారు వేధిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జహీరుద్దీన్‌ను అరెస్ట్ చేశారు.

Uttar Pradesh
Hair
Food
  • Loading...

More Telugu News