Maharashtra: మహారాష్ట్ర మంత్రిపై ఇంకు దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

Man throws ink at Maharashtra minister Chandrakant Patil

  • స్కూళ్లు, కాలేజీల కోసం నిధులు ‘అడుక్కోవాలన్న’ మంత్రి
  • నల్లజెండాలతో నిరసన తెలిపే యత్నం 
  • మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఫడ్నవీస్

మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్ పాటిల్‌పై పూణెలో ఇంకు దాడి జరిగింది. మిమ్రీ పట్టణంలో పర్యటిస్తున్న ఆయనపై దుండగుడు సిరా చల్లాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో కొందరు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, డాక్టర్ అంబేద్కర్, పూలేపై మంత్రి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. 

శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. విద్యాలయాల అభివృద్ధి కోసం అప్పట్లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే ప్రభుత్వ నిధులను అడగలేదని అన్నారు. పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలంటే ప్రజలంతా ఒక్కటై నిధులు అడుక్కోవాలని అన్నారు. ‘అడుక్కోవాలి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రజలే నిధులు సమకూర్చుకోవాలని చెప్పడమే ఆయన ఉద్దేశమని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News