: నందమూరి తారకరత్న మనసులో మాట
సినీ నటుడు తారకరత్న సినిమాలు వరుసగా చెట్టెక్కుతుండడంతో తన దృష్టి వేరే వ్యాపకాలపైకి మళ్లిస్తున్నాడు. తిరుమల తిరుపతిలో స్వామివారి దర్శనానికి వచ్చిన తారక రత్న మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశిస్తే పోటీ చేస్తానంటూ మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికైతే మావయ్యే సీఎం అభ్యర్ధి అన్న ఆయన, బాబాయ్ సేవలు పార్టీకి అవసరమని అభిప్రాయపడ్డాడు. మహానాడు అంటే తెలుగు దేశం కుటుంబసభ్యుల పండగని, దానికి ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలకాల్సిన అవసరం లేదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వెళ్లిందో లేదో తనకు తెలియదన్నారు.