ugc: నాలుగేళ్ల కోర్సుగా ఆనర్స్ డిగ్రీ!

Honours degree only after studying for four years

  • నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయింపు
  • మార్గదర్శకాలను విడుదల చేసిన యూజీసీ
  • మూడేళ్ల కోర్సు కూడా ఉంటుందని వెల్లడి

నూతన విద్యావిధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. నాలుగేళ్లు లేదా మూడేళ్లు.. ఆనర్స్ లో ఏ డిగ్రీ కోర్సును ఎంచుకోవాలనే చాయిస్ విద్యార్థులదేనని పేర్కొంది. కాగా, నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో భాగంగా ఈ కోర్సును ప్రవేశపెట్టినట్లు యూజీసీ తెలిపింది. ఈ కొత్త కోర్సుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీలో అవసరమైతే రీసెర్చ్‌ స్పెషలైజేషన్‌ను ఎంచుకునే వీలును విద్యార్థులకు కల్పిస్తున్నట్లు వివరించింది. దీనిని ఎంచుకున్న విద్యార్థులు మొత్తం 160 క్రెడిట్లు పూర్తిచేయాలి. అప్పుడే రీసెర్చ్‌ స్పెషలైజేషన్‌తో ఆనర్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల డిగ్రీని ఎంచుకునే విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తిచేయాలి. 

నాలుగేళ్ల కోర్సులో చేరి మూడేళ్ల లోపు మానేస్తే.. మూడేళ్లలోపు అదే కోర్సులో చేరే అవకాశం కల్పించినట్లు యూజీసీ తెలిపింది. మొత్తంగా ఏడేళ్లలోపు ఈ కొత్త కోర్సును పూర్తిచేయాలి. ఇందులో మేజర్‌, మైనర్‌ స్ట్రీమ్‌ కోర్సులుంటాయి. అలాగే లాంగ్వేజ్‌ కోర్సులు, స్కిల్‌ కోర్సులు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌, అండర్‌స్టాండింగ్‌ ఇండియా, డిజిటల్‌ అండ్‌ టెక్నలాజికల్‌ సొల్యూషన్స్‌, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌, యోగా ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ కోర్సులు ఎంచుకోవచ్చని యూజీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News