: వందకోట్లకి సీఎం సీటును కేసీఆర్ అమ్మేశారు: టీఆర్ఎస్ నేత చింతా స్వామి ఆరోపణ
వంద కోట్లకు సీఎం సీటును ఎంపీ వివేక్ కు కేసీఆర్ అమ్ముకున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా స్వామి ఆరోపించారు. టీఆర్ఎస్ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తోందని, కోటికో అసెంబ్లీ సీటు, పది కోట్లకు ఎంపీ సీటు, వంద కోట్లకు సీఎం సీటు ఇస్తానంటోందని విమర్శించారు. ఎంపీ వివేక్ కు వంద కోట్లకు ముఖ్యమంత్రి సీటు అమ్ముకున్నారని ఆయన అన్నారు. తాజాగా తెలంగాణ ఉద్యమం, పార్టీలో పెరుగుతున్న పెడధోరణులను వివరించడానికి కేసీఆర్ సమయం ఇవ్వడం లేదన్న స్వామి, కేసీఆర్ వ్యవహార శైలిపై మండిపడుతూ బహిరంగ లేఖాస్త్రం సందించారు. తెలంగాణను సీమాంధ్రులు అడ్డుకున్నారని మాట్లాడుతున్న కేసీఆర్, ఏకమైన తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర వాదనను పక్కన పెట్టి ఓట్లు, నోట్లు, సీట్ల కోసం టీఆర్ఎస్ దేనికి ప్రయత్నిస్తోందని అడిగారు. డబ్బు అవసరమైతే భిక్షాటన చేసి వసూలు చేద్దామన్నారు.