Danam Nagender: బీఆర్ఎస్ వచ్చినా తెలంగాణపై పేటెంట్ మాదే: దానం నాగేందర్

BRS is historical need says Danam Nagender

  • బీఆర్ఎస్ గా మారనున్న టీఆర్ఎస్
  • బీఆర్ఎస్ చారిత్రక అవసరం అన్న దానం
  • మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సి వచ్చిందని వ్యాఖ్య

టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ గా మారనున్న సంగతి తెలిసిందే. కాసేపట్లో తెలంగాణ భవన్ లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ ఒక చారిత్రక అవసరమని చెప్పారు. మతతత్వ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ రావాల్సి వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినా తెలంగాణపై పేటెంట్ తమదేనని చెప్పారు. కేంద్రంలో తామే ఉండాలని బీజేపీ భావిస్తోందని... బీజేపీ ఆలోచనలకు కేసీఆర్ ముగింపు పలుకుతారని అన్నారు.

Danam Nagender
TRS
BRS
Telangana
BJP
  • Loading...

More Telugu News