Brahmanandam: రేపటి ప్రశ్నలకి నిన్నొక బదులంటా .. 'పంచతంత్రం' లిరికల్ సాంగ్ రిలీజ్!

panchatantram movie update

  • విభిన్నమైన కథా చిత్రంగా 'పంచతంత్రం'
  • కొన్ని జీవితాల్లోని సంఘటనల సమాహారం ఇది 
  •  ప్రతి కథ ఉద్దేశం అనుభూతి ప్రధానంగా సాగడమే 
  • రేపు విడుదలవుతున్న సినిమా 

ఐదు దారుల్లో నడిచే కొంతమంది వ్యక్తుల జీవనప్రయాణాన్ని అందంగా ఆవిష్కరించే చిత్రమే 'పంచతంత్రం'. అఖిలేశ్ నిర్మాణంలో హర్ష పులిపాక దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రేపు థియేటర్లకు రానుంది. బ్రహ్మానందం .. సముద్రఖని .. స్వాతి రెడ్డి .. శివాత్మిక .. దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'రేపటి ప్రశ్నలకి నిన్నొక బదులంటా .. నేటికి ఘటనంటా .. మరునాటికి గతమంటా' అంటూ ఈ పాట సాగుతోంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, కాలభైరవ ఆలపించాడు. 

జీవితం .. పరిచయాలు .. ప్రేమలు .. ఆనందాలు .. అనుబంధాలు .. ఆవేశాలు .. ఆవేదనలు ..  అసహనాలు ఇలా అన్నింటినీ టచ్ చేస్తూ వెళ్లే కథ ఇది.  బ్రహ్మానందం పెద్ద దిక్కుగా నడిపించే ఈ కథ ఎంతవరకూ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.

More Telugu News