Gujarat: గుజరాత్ ఫలితాలు.. ఆప్ సీఎం అభ్యర్థి ఓటమి

AAP CM candidate Isuda Gadhvi loses

  • ఆప్ సీఎం అభ్యర్థి గఢ్వీ పరాజయం
  • 19 వేల ఓట్ల తేడాతో గెలిచిన బీజేపీ అభ్యర్థి
  • 1.34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సీఎం భూపేంద్ర పటేల్

గుజరాత్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీకి తీవ్ర నిరాశ ఎదురైంది. గుజరాత్ ప్రజలను ఆకట్టుకోవడంలో ఆప్ పూర్తిగా విఫలమయింది. 182 స్థానాలకు గాను కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. మిగిలిన 177 స్థానాల్లో ఆప్ అభ్యర్థులకు షాక్ తగులుతోంది. 

ఈ క్రమంలో ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ 19 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ద్వారక జిల్లాలో జన్మించిన గఢ్వీ జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు ఆధారంగా ఆయనను కేజ్రీవాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘన విజయం సాధించారు. ఏకంగా 1.34 లక్షల ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Gujarat
AAP CM candidate
Isuda Gadhvi
  • Loading...

More Telugu News