voter: ఓటరు నమోదుకు నేడే ఆఖరు... ఇలా నమోదు చేసుకోవచ్చు

Today is the last date for voter registration
  • నవంబర్ 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
  • కొత్త ఓటరు నమోదు, జాబితాలో సవరణకు డిసెంబర్ 8 వరకు గడువు
  • అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన
స్పెషల్ సమరీ రివిజన్-2023 లో భాగంగా ఓటరు నమోదుకు గడువు గురువారం (నేడు)తో ముగుస్తోంది. ఎన్నికల సంఘం నవంబర్ 9న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు తప్పులను సవరించుకొనేందుకు, నూతన ఓటరు నమోదు కొరకు డిసెంబర్ 8 వరకు గడువు ఇచ్చింది. ఓటరు జాబితాలో గల ఇంటి చిరునామా సవరణ, ఇతర నియోజక వర్గాలకు బదిలీ, ఓటరు గుర్తింపు కార్డులో తప్పుల సవరణ, దివ్యాంగుల గుర్తింపు కోసం అభ్యర్థన, అభ్యంతరాల కోసం ఈ వెలుసుబాటు కల్పించింది. 

నేటితో ఈ గడువు ముగుస్తుంది. కొత్త ఓటరు నమోదు, మార్పులకు  www.nvsp.in వెబ్ సైట్, voter helpline  అనే యాప్ ను ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా, భారత ఎన్నికల కమిషన్ ఏడాదికి 4 అర్హత తేదీల  (జనవరి 1 ,ఏప్రిల్ 1,  జులై 1, అక్టోబర్ 1)  నాటికి 18 సంవత్సరాలు పూర్తయ్యే  వారు ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న వారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు.
voter
registration
election commission of india
new voters

More Telugu News