Adi Reddy: బిగ్ బాస్ హౌస్ లో డార్క్ రూమ్ .. భయపడిపోయిన శ్రీసత్య!

Bigg Boss 6  Update

  • ఇంటి సభ్యులను భయపెట్టేస్తున్న బిగ్ బాస్ 
  • డార్కు రూమ్ లో హడలిపోయిన ఆదిరెడ్డి 
  • అతనికి తోడుగా వచ్చిన శ్రీహాన్ పరిస్థితి అదే 
  • డార్క్ రూమ్ లోకి వెళ్లడం తనవల్ల కాదన్న శ్రీ సత్య 
  • యాక్షన్ తీసుకోనున్న బిగ్ బాస్ 

బిగ్ బాస్ హౌస్ లో రెండు మూడు రోజులుగా గేమ్ లో భాగంగా ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న శ్రీసత్య తనకి గతంలో ఎదురైన ఒక దెయ్యం సంఘటన గురించి ఇంటి సభ్యులతో ప్రస్తావించింది. దాంతో బిగ్ బాస్ హారర్ మ్యూజిక్ ను ప్లే చేసి ఇంటి సభ్యులను హడలెత్తించాడు. ఇల్లంతా పరుగులు పెట్టించాడు. ఇంటి సభ్యులు ఒంటరిగా ఉండటానికి భయపడటం చూసేవారికి నవ్వు తెప్పించింది. 

ఇక నిన్న బిగ్ బాస్ హౌస్ లో ఒక్కొక్కరినీ డార్క్ రూమ్ లోకి పంపించే గేమ్ ఒకటి బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. డార్క్ రూమ్ లోకి వెళ్లి .. బిగ్ బస్ చెప్పిన ఐటమ్స్ ను పట్టుకురావాలి. ఆదిరెడ్డి టేకిట్ ఈజీగా తీసుకుని ఆ డార్క్ రూమ్ లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ తరువాత ఆర్ ఆర్ దెబ్బకి భయపడిపోయి, తనకి వెంటనే మరొకరి తోడు కావాలని శ్రీహాన్ పేరు చెప్పాడు. దాంతో శ్రీహన్ ఆ డార్కు రూమ్ లోకి అడుగుపెట్టాడు. 

డార్కు రూమ్ గురించి తక్కువ అంచనా వేస్తూ .. ఆడుతూ పాడుతూ వచ్చిన శ్రీహాన్ హడలిపోయాడు. చీకట్లో ఏవో ఆకారాలు .. పాములు .. గజ్జెల శబ్దాలతో బెదిరిపోయాడు. భయంతో అతను చేసిన హడావిడి ఆడియన్స్ ను తెగ నవ్విస్తుంది. తాను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇంత భయపడలేదని ఆదిరెడ్డి అనడం కొసమెరుపు. ఈ రోజున శ్రీ సత్య డార్కు రూమ్ లోకి వెళ్లవలసి ఉంది. తనకి చచ్చిన బొద్దింకలంటేనే భయమనీ, అందువలన పాములున్న డార్కు రూములోకి తాను వెళ్లను గాక వెళ్లను అంటూ ఆమె భీష్మించుకుంది. ఇక బిగ్ బాస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడనేది ఈ రోజున చూడాలి.

Adi Reddy
Sri han
Sri Sathya
Bigg Boss
  • Loading...

More Telugu News