pooja Hegde: సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ప్రేమాయణం?

Salman Khan and Pooja Hegde in love

  • పూజ ప్రేమలో సల్మాన్ ఉన్నాడంటూ ఉమైర్ సంధూ ట్వీట్
  • ఇద్దరూ కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారన్న ఉమైర్
  • పూజకు మరో రెండు సినిమాల్లో సల్మాన్ అవకాశం ఇచ్చాడని వ్యాఖ్య

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. దక్షిణాదిలో తిరుగులేని హీరోయిన్ గా ఆమె చెలామణి అవుతోంది. బాలీవుడ్ లో సైతం అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి. పూజ సినీ కెరీర్ బాలీవుడ్ నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ గెస్ట్ పాత్రలో నటిస్తున్నారు. 

మరోవైపు, పూజా హెగ్డే పర్సనల్ లైఫ్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ మధ్య అఫైర్ కొనసాగుతోందని ఆయన ట్వీట్ చేశారు. పూజ ప్రేమలో సల్మాన్ పడిపోయాడని.. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని చెప్పారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ పూజకు మరో రెండు సినిమాల్లో అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఈ విషయం సల్మాన్ కు అంత్యంత సన్నిహిత వర్గాల నుంచి తనకు తెలిసిందని చెప్పారు. 

సల్మాన్ కు హీరోయిన్లతో అఫైర్లు కొత్తేమీ కాదు. ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపారు. ఇప్పుడు పూజతో అఫైర్ నిజమేనా? అనే విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

pooja Hegde
Salman Khan
Love
Affair
Bollywood
Tollywood

More Telugu News