Ramana Dikshitulu: టీటీడీపై తీవ్ర విమర్శలు గుప్పించిన రమణ దీక్షితులు

Only corruption prevailing in TTD says Ramana Dikshitulu
  • గతంలో టీటీడీలో వివిధ కులాలకు చెందిన వారు సేవలు అందించేవారన్న దీక్షితులు
  • 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారని విమర్శ
  • టీటీడీలో అవినీతి రాజ్యమేలుతోందని మండిపాటు
టీటీడీపై తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 వంశపారంపర్య కుటుంబాలు సేవలు అందించేవని... వీరిలో యాదవులు, కుమ్మరి, వెదురు బుట్టలు అల్లేవారు, ముగ్గులు వేసేవారు, తోటమాలిలు, చేనేతలు, వడ్రంగి, స్వర్ణకారులు తదితరులు ఉన్నారని చెప్పారు. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారని విమర్శించారు. ప్రస్తుతం తిరుమలలో అంతులేని అవినీతి మాత్రమే ఉందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.  
Ramana Dikshitulu
TTD
30/87 Act
Corruption

More Telugu News