Prudhvi Raj: రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలి: నటుడు పృథ్వీ

Actor Prudhvi talks about politics

  • కడప పెద్ద దర్గాను దర్శించిన  'ఏపీ జీరో ఫోర్ రామాపురం' చిత్రబృందం
  • రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన పృథ్వీ 
  • రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని వ్యాఖ్య 

టాలీవుడ్ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పృథ్వీ ప్రస్తుతం 'ఏపీ జీరో ఫోర్ రామాపురం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రబృందం తాజాగా కడప పెద్ద దర్గాను సందర్శించింది. నటుడు పృథ్వీ, హీరోహీరోయిన్లు, దర్శకుడు దర్గాలో చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ, కడప పెద్ద దర్గాను దర్శించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో ఇక్కడికి చాలాసార్లు వచ్చానని, ఈసారి 'ఏపీ జీరో ఫోర్ రామాపురం' చిత్రం కోసం ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందేనని, ఇవాళ ఉర్సు సందర్భంగా దర్గా వద్దకు వచ్చామని, ఉర్సు రోజున ఆ భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని అన్నారు. రాష్ట్రంలో పాలన ఎప్పుడో గాడి తప్పిందని పృథ్వీ వ్యాఖ్యానించారు. 

"పెళ్లి చేసుకుని పదిహేనేళ్లో, పాతికేళ్లో సజావుగా కాపురం చేస్తారు... కుదరకపోతే విడిపోతారు. ఇదీ అంతే... ఏమైనా బాండ్ రాసి వచ్చామా, ఏదైనా బొట్టు పెట్టి వచ్చామా! పద్ధతులు నచ్చక పార్టీ నుంచి బయటికి వచ్చేశాను. పార్టీలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేశాను. నా మీద ఆరోపణలు చేసిన వారు ఇక్కడికి వచ్చి అల్లా సాక్షిగా ప్రమాణం చేయమనండి... నీతి నిజాయతీ ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది" అంటూ పృథ్వీ స్పందించారు.

Prudhvi Raj
Politics
Andhra Pradesh
YSRCP
Tollywood
  • Loading...

More Telugu News