Miss India-2023: మిస్ ఇండియా-2023 పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం... అర్హతలు ఇవే!

Applications invited for Miss India 2023

  • ఈసారి అందాల పోటీలు మణిపూర్ లో!
  • దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందగత్తెలకు ఆహ్వానం
  • 30 మందితో తుది జాబితా

భారత్ లో గత ఆరు దశాబ్దాల నుంచి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ గా ఎంపికపై అంతర్జాతీయ స్థాయిలోనూ భారత మగువలు సత్తా చాటారు. ద మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐఓ) నిర్వహించే ఈ పోటీలకు ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్ లో ఈ అందాల పోటీలు ఫెమీనా పేరుమీదే ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా చలామణి అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో, 2023 మిస్ ఇండియా పోటీలకు ప్రకటన వెలువడింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందాల భామలకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఎంఐఓ వెల్లడించింది. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందాల పోటీలు నిర్వహించి 30 మందితో తుది జాబితా రూపొందించి, వారి నుంచి ఒక అందాల సుందరికి మిస్ ఇండియా కిరీటం తొడుగుతారు.

అందాల పోటీల్లో పాల్గొనేందుకు అర్హతలు ఇవే...
వయసు: 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. 
ఎత్తు: 5.3 అడుగులు, ఆపైన (హీల్స్ లేకుండా).
బరువు: 51 కిలోలు మించకూడదు.
రిలేషన్ షిప్ స్టేటస్: అవివాహితులై ఉండాలి. ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి ఉండకూడదు. గతంలో పెళ్లి చేసుకుని విడిపోయినా అనర్హులు అవుతారు.
నేషనాలిటీ: భారతీయులై ఉండాలి. భారత పాస్ పోర్టు కలిగి ఉండాలి. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్న వారు కేవలం సెకండ్ రన్నరప్ కోసం పోటీ పడేందుకు అర్హులవుతారు. 

www.missindia.com వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ 59వ మిస్ ఇండియా అందాల పోటీలు మణిపూర్ లో నిర్వహించనున్నారు.

Miss India-2023
Beauty Contest
Femina
Manipur
India
  • Loading...

More Telugu News