Ayyanna Patrudu: పరదాలు లేకుండా బయటకు వెళ్లలేని జగన్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు?: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu comments on Jagan

  • బీసీలకు జగన్ చేసిందేమీ లేదన్న అయ్యన్న
  • వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ సమాధి కడతారని వ్యాఖ్య
  • చంద్రబాబు సీఎం అయితేనే బీసీలకు పూర్వవైభవం వస్తుందన్న అయ్యన్న

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. బీసీ కులాలకు జగన్ చేసింది ఏమీ లేదని అన్నారు. రోడ్లపై పరదాలు లేకుండా బయటకు వెళ్లలేని జగన్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ఎద్దేవా చేశారు. జగన్ రాసి పెట్టుకో... వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు రాజకీయ సమాధి కడతారని వ్యాఖ్యానించారు. జగన్ కు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలు బాధపడుతున్నారని... వచ్చే ఎన్నికల్లో ఆ తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు పూర్వవైభవం వస్తుందని అన్నారు. ఐదుగురు రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు.

Ayyanna Patrudu
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News