Thiru Veer: 160 నిమిషాల ఉత్కంఠ .. 'జర్నీ ఆఫ్ మసూద' వీడియో రిలీజ్!

Masooda Movie update

  • తక్కువ బడ్జెట్ లో రూపొందిన 'మసూద'
  • స్టార్స్ లేకుండా థియేటర్లకు రప్పించిన సినిమా 
  • కంటెంట్ తోనే భయపెట్టిన డైరెక్టర్ 
  • టీమ్ ఎఫర్టుకు అద్దం పడుతున్న వీడియో  

ఈ మధ్య కాలంలో చాలానే హారర్ థ్రిల్లర్ సినిమాలు తెరపైకి వచ్చాయి. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు జోనర్ కి తగినట్టుగా భయపెట్టడానికి ప్రయత్నించాయి. కానీ 'మసూద' అలా కాదు. స్టార్స్ లేకుండా .. భారీ బడ్జెట్ తో పనిలేకుండా కేవలం కంటెంట్ తో ఆడియన్స్ ను భయపెట్టడంలో సక్సెస్ అయింది.

ఈ కథ ఎత్తుగడ చూస్తేనే స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేశారనే విషయం అర్థమవుతుంది. అలాగే లైటింగ్ .. కెమెరా వర్క్ .. ఫొటోగ్రఫీ .. కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి అయిన 'మసూద' ముఖాన్ని కూడా చూపించకుండా కథ నడిపించడం గొప్ప విషయం. 

చిన్న సినిమానే అయినా, చిత్రీకరణ పరంగా పెద్ద సినిమా స్థాయిలో కష్టపడ్డారనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. 150 పేజీల కథను 160 నిమిషాల అవుట్ పుట్ గా మార్చడానికి ఈ సినిమా టీమ్ ఎంతగా కష్టపడిందనేది తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ఆ వీడియో మీ కోసం.

More Telugu News