YS Sharmila: షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్.. ఢిల్లీకి రావాలని పిలుపు!

Modi telephones YS Sharmila

  • షర్మిలతో 10 నిమిషాలు మాట్లాడిన మోదీ
  • టీఆర్ఎస్ దాడి నేపథ్యంలో షర్మిలకు పరామర్శ
  • ధైర్యంగా ఉండాలన్న ప్రధాని

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడినట్టు సమాచారం. ఇటీవల పాదయాత్ర సందర్భంగా షర్మిలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఘటనకు నిరసనగా ధ్వంసమైన తన కారులో ఆమె ప్రగతి భవన్ కు బయల్దేరగా... ఆమె కారులో ఉండగానే వాహనాన్ని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిన విషయం కూడా విదితమే. 

ఈ నేపథ్యంలో, షర్మిలను ప్రధాని ఫోన్ ద్వారా పరామర్శించినట్టు తెలుస్తోంది. ధైర్యంగా ఉండాలని ఆయన చెప్పారు. ఢిల్లీకి రావాలని ఆమెకు సూచించారు. తనకు అండగా నిలిచి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. ఏదేమైనప్పటికీ షర్మిలకు మోదీ ఫోన్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

YS Sharmila
YSRTP
Narendra Modi
BJP
Phone
  • Loading...

More Telugu News