L Vijayalakshmi: 'గుండమ్మకథ' విషయంలో అలా జరిగింది: ఎల్. విజయలక్ష్మి

L Vijayalakshmi Interview

  • నటిగా .. నర్తకిగా ఎల్. విజయలక్ష్మి
  • 'సిపాయి కూతురు' సినిమాతో పరిచయం 
  • 'గుండమ్మ కథ' గురించి ప్రస్తావించిన విజయలక్ష్మి 
  • ఆ సినిమాలో ఆమె డాన్స్ కి పాట లేకపోవడానికి అదే కారణమట     

పాత సినిమాలను చూసే అలవాటు ఉన్నవారికి గుర్తుచేయవలసిన అవసరం లేని పేరు ఎల్.విజయలక్ష్మి. నటిగా .. నర్తకిగా అప్పట్లో ఆమెకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలుపుకుని ఎనిమిదేళ్లలో ఆమె 100 సినిమాలలో నటించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"మొదటి నుంచి కూడా నాకు డాన్స్ అంటే ఇష్టం. అందువలన మా పేరెంట్స్ నాకు డాన్స్ నేర్పించారు. ఒక స్టేజ్ పై నేను డాన్స్ చేస్తుంటే చూసి, 'సిపాయి కూతురు' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అలా 1959లో నేను తెలుగు తెరకు పరిచయమయ్యాను. 'గుండమ్మ కథ'లో నేను చేసిన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం" అన్నారు. 

'గుండమ్మకథ'లో నేను హారనాథ్ జోడిగా కనిపిస్తాను. సినిమా షూటింగు మొత్తం పూర్తయిన తరువాత, ఎల్. విజయలక్ష్మిని పెట్టుకుని ఒక్క డాన్స్ కూడా లేకపోవడం ఏంటి? అంటూ కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రిలీజ్ టైమ్ కూడా దగ్గరలో ఉండటం వలన, పాట లేకుండా కేవలం మ్యూజిక్ పైనే నాపై డాన్స్ ను షూట్ చేశారు' అని చెప్పుకొచ్చారు.

L Vijayalakshmi
Ali
Alitho Saradaga
  • Loading...

More Telugu News