Nayanatara: నయనతార నుంచి మరో హారర్ థ్రిల్లర్ .. 'కనెక్ట్' తెలుగు టీజర్ రిలీజ్!
![Connect movie teaser released](https://imgd.ap7am.com/thumbnail/cr-20221205tn638da5e23d15a.jpg)
- నయనతార సొంత బ్యానర్లో 'కనెక్ట్'
- ముఖ్య పాత్రల్లో అనుపమ్ ఖేర్ .. సత్య రాజ్
- ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల.
నయనతారకి తెలుగు .. తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూనే .. మరో వైపున నాయిక ప్రధానమైన కథలను చేస్తూ వెళుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఆమె సినిమాలు విడుదలై భారీ వసూళ్లను రాబడుతున్నాయి.
![](https://img.ap7am.com/froala-uploads/20221205fr638da66c8fef8.jpg)
తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను వదిలారు. కథను ఏ మాత్రం రివీల్ చేయకుండా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. పృథ్వీ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నారు. అనుపమ్ ఖేర్ .. సత్యరాజ్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.