Faima: ఫైమా ఎలిమినేషన్ .. ఆమె చేతిపై నాగ్ ముద్దు!

- బిగ్ బాస్ లో ఫైనల్స్ కి చేరుకున్న శ్రీహాన్
- ఆ ఛాన్స్ ను చేజార్చుకున్న రేవంత్
- హౌస్ నుంచి బయటికి ఫైమా
- ఆమె ఎలిమినేషన్ కి అదే కారణమంటూ టాక్
బిగ్ బాస్ హౌస్ లో మొన్న శనివారం రోజున.. నిన్న ఆదివారం రోజున అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం రోజున రేవంత్ తొందరపాటు .. ఆయన ఆవేశం కారణంగా ఆయన 'టికెట్ టు ఫినాలే'లో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆ ఛాన్స్ శ్రీహాన్ కి వెళ్లింది. ఇక ఎలాంటి పోటీ లేకుండా ఆయన ఫైనల్స్ కి వెళ్లిపోయాడు. అంతవరకూ కెప్టెన్సీ చేసినవారిలో ఎవరు బెస్ట్ అనే అభిప్రాయ సేకరణలో మిగిలిన వాళ్లంతా కూడా ఇనయా పేరును చెప్పడం విశేషం.

అలాంటి పరిస్థితుల్లో ఫైమా తల్లి .. శ్రీ సత్యను గురించి అలా మాట్లాడటం ఫైమా ఎలిమినేషన్ కి కారణం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక ఫైమా తన చేతిపై ఎవరినీ ముద్దు పెట్టుకోనివ్వదనీ .. తనకి చక్కిలిగిలి అని, ఆమె నాగ్ తో స్టేజ్ పై ఉండగా రేవంత్ చెప్పాడు. దాంతో సరదాగా నాగార్జున ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టేశారు. ఫైమా సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ .. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ సరదా సన్నివేశం నవ్వులు పూయించింది.
