TG Venkatesh: అమరావతే ఏకైక రాజధాని అనేది బీజేపీ విధానం: టీజీ వెంకటేశ్

TG Venkatesh comments on AP issues

  • విజయవాడలో టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు
  • జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శలు
  • జగన్ రాయలసీమకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జగన్, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రజలను దగా చేశాయని విమర్శించారు. రాయలసీమకు ఏంచేశారో జగన్ వివరించాలని, రాయలసీమ డిక్లరేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా పెట్టుబడులు పక్క రాష్ట్రానికి వెళుతున్నాయని అన్నారు. 

అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అనేది బీజేపీ విధానం అని టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు. అయితే, రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

More Telugu News