Umran Malik: సీనియర్ పేసర్ షమీకి గాయం... ఉమ్రాన్ మాలిక్ కు చాన్స్

Umran Malik replaced injured Shami

  • బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా
  • మూడు వన్డేల సిరీస్ కు ముందే ఎదురుదెబ్బ
  • గాయంతో షమీ దూరం
  • షమీ స్థానం ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ

బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గాయపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో షమీ స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. షమీ దూరం కావడంతో సీనియర్ సెలెక్షన్ కమిటీ ఉమ్రాన్ మాలిక్ ను వన్డే సిరీస్ కు ఎంపిక చేసిందని తెలిపింది. 

మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చింది. ఆదివారం తొలి వన్డే జరగనుంది. అయితే భారత్ లో ఉన్నప్పుడే ప్రాక్టీసు చేస్తుండగా షమీ భుజం గాయానికి గురయ్యాడు. అతడు జట్టుతో పాటు బంగ్లాదేశ్ వెళ్లలేదు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న షమీ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చారు.

Umran Malik
Shami
Injury
ODI Series
Team India
Bangladesh
  • Loading...

More Telugu News