K Kavitha: కేసీఆర్ తో కవిత భేటీ

Kavitha meets KCR

  • ప్రగతి భవన్ కు వెళ్లిన కవిత
  • సీబీఐ నోటీసుల నేపథ్యంలో తండ్రితో భేటీ
  • ఇప్పటికే కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. ప్రగతి భవన్ కు వెళ్లిన ఆమె తన తండ్రితో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 

ఈ నోటీసుల నేపథ్యంలోనే కేసీఆర్ ను కవిత కలిశారు. నోటీసులపై న్యాయపరంగా, రాజకీయపరంగా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం.

హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావచ్చని నోటీసులో తెలిపింది. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్ లో కవిత పాత్ర ఎంత ఉందనే కోణంలో సీబీఐ విచారణ జరపనుంది. ఈ కేసులో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉన్న సంగతి తెలిసిందే.

K Kavitha
KCR
TRS
CBI
  • Loading...

More Telugu News