Leopard: బెంగళూరు శివార్లలో చిరుత సంచారం... హడలిపోతున్న ప్రజలు
- కెంగేరి ప్రాంతంలో కనిపించిన చిరుత
- ఓ జింకను చంపిందంటున్న అటవీశాఖ సిబ్బంది
- పలు ప్రాంతాల్లో బోనుల ఏర్పాటు
గార్డెన్ సిటీగా పేరొందిన అందాల నగరం బెంగళూరు శివారు ప్రాంతాల్లో ఓ చిరుతపులి హడలెత్తిస్తోంది. బెంగళూరు పరిసరాల్లోని తురహళ్లి అటవీప్రాంతం నుంచి ఇది వెలుపలికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. రెండ్రోజుల కిందట ఈ చిరుత కెంగేరి ప్రాంతంలో కనిపించింది. దాంతో బెంగళూరు వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇటీవల ఇది ఓ జింకను వేటాడుతూ వచ్చి నగర పరిసరాల్లోకి చేరి ఉంటుందని భావిస్తున్నారు. దీని కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. కాగా, ఈ ప్రాంతంలో నాలుగు చిరుతలు కనిపించాయని పుకార్లు వ్యాపించడంతో ప్రజలు బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు.