: ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాలు
ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్దమైంది. 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ సన్నాహక మ్యాచ్ లో నేడు భారత్... శ్రీలంకను ఢీకొట్టనుంది. అన్ని విధాల మంచి ఫాంలో ఉన్న భారత్, ఇంగ్లిష్ పిచ్ లపై రాణించాల్సిన అవసరముంది. అయితే, ఫాస్ట్ బౌలింగుకు అనుకూలించే మైదానాల్లో మన బ్యాట్స్ మన్ బాగా ఆడగలిగితే ఇక తిరుగుండదు. మరోవైపు ఇప్పటి వరకూ టీ ట్వంటీ ఆడుతున్న అన్ని దేశాల జట్లలో మన జట్టులోని సభ్యులకు ఎక్కువ ప్రాక్టీస్ కూడా లభించింది. బౌలింగ్, ఆల్ రౌండర్లతో నిండి ఉన్న లంకేయులను ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో నిలువరిస్తారో, లేదో, చూడాలి. పూల్ బీలో ఉన్న భారత జట్టు లీగ్ దశలో పాక్, విండీస్, ఆసీస్ వంటి జట్లతో తలపడనుంది.