Bollywood: మలైకా గర్భవతి అయిందంటూ వార్త.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన అర్జున్ కపూర్

Arjun Kapoor slams reports on Malaika Arora pregnancy

  • తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకాతో సహజీవనం చేస్తున్న అర్జున్
  • మలైక గర్భం దాల్చింది, త్వరలోనే ఇద్దరి పెళ్లి అంటూ కథనం
  • వార్తను ఖండించి, సదరు విలేకరిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన అర్జున్

బాలీవుడ్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. 37 ఏళ్ల అర్జున్ తనకంటే 12 ఏళ్లు పెద్దదైన మలైకా అరోరాతో  ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరూ చాలా కాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ తో 2017లో విడాకులు తీసుకున్న మలైక..  బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ ప్రేమలో పడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. మొదట్లో తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచిన ఈ ఇద్దరూ తర్వాత చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో మలైకా అరోరా తల్లి కాబోందని, త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని ఓ ఆంగ్ల మీడియా సంస్థ కథనం ప్రచురించింది. ఈ వార్తను అర్జున్ ఖండించాడు. ఆ వార్త  స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అర్జున్.. ఇలాంటి పనికిరాని రాతల వల్ల మేం ఎంతలా ఇబ్బందిపడతామో మీకు తెలుసా? అని ప్రశ్నించాడు. తాము పట్టించుకోకపోవడం వల్లే సదరు విలేకరి తరచూ ఇటువంటి వార్తలనే రాస్తున్నారని, అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో అంతా నిజమని నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా తమ వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయొద్దని హెచ్చరించాడు. అర్జున్ కామెంట్ ను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన మలైక కూడా తీవ్ర పదజాలంతో ఈ వార్తలను ఖండించింది.

Bollywood
malaila arora
arjun kapoor
pregnancy
news
  • Loading...

More Telugu News