Youth: వరుడికి వర్క్ ఫ్రమ్ హోమ్... పెళ్లిపీటల మీద కూడా ల్యాప్ టాప్ తో కుస్తీ

Youth works on laptop while his marriage being done
  • పెళ్లి చేసుకుంటున్న యువకుడు
  • పురోహితుడు మంత్రాలు చదువుతుంటే ల్యాప్ టాప్ పై ఉద్యోగ విధులు
  • నెట్టింట ఫొటో వైరల్.. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు
నెట్టింట ఇప్పుడొక ఫొటో వైరల్ అవుతోంది. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా ఓ యువకుడు పెళ్లి పీటల మీద కూడా ల్యాప్ టాప్ పట్టుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న దృశ్యం ఆ ఫొటోలో చూడొచ్చు. 

కరోనా దెబ్బకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫొటోలో కనిపిస్తున్న యువకుడు కూడా వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తూనే, మరోవైపు పెళ్లినాటి ప్రమాణాలు ఆచరిస్తుండడం సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. 

మనవాడు వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని మరో లెవెల్ కు తీసుకుపోయాడని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, ఉద్యోగాన్ని, పర్సనల్ లైఫ్ ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ యువకుడు నేర్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. మరికొందరేమో, పెళ్లి రోజున కూడా అతడిని ఆనందంగా ఉండనివ్వరా? అంటూ స్పందిస్తున్నారు.
Youth
Marriage
Laptop
Work From Home

More Telugu News