Krishna: అప్పట్లో ఫారిన్ కారు కొనడమే కృష్ణ కల: చంద్రమోహన్

Chandra Mohan Interview

  • కృష్ణతో అనుబంధం గురించి ప్రస్తావించిన చంద్రమోహన్
  • కృష్ణ స్పీడ్ చూసి ఆశ్చర్యపోయేవారమని వెల్లడి 
  • ఆయన సొంత బ్యానర్లో ఎక్కువ సినిమాలు చేశానంటూ వివరణ

కథానాయకుడిగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్ సుదీర్ఘమైన ప్రస్థానాన్ని కొనసాగించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన కృష్ణతో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. "నేను .. కృష్ణ ఇద్దరం దాదాపు ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము. ఎవరికి వారుగా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాళ్లం. మద్రాసులో నేను .. రామ్మోహన్ ఒకే రూమ్ లో ఉండేవాళ్లం. అప్పటికి కృష్ణకి పెళ్లి అయినా, అతను ఇంకా కాపురం పెట్టలేదు. అందువలన మా రూమ్ కి వచ్చి వెళుతూ ఉండేవాడు" అన్నారు.  

"కృష్ణ అప్పట్లోనే చాలా స్పీడ్ గా ఉండేవాడు. అవకాశాల కోసం తిరుగుతూ నిర్మాతలతో టచ్ లో ఉంటూ ఉండేవాడు. ఏ రోజుకు ఆ రోజు మా రూమ్ కి వచ్చి .. ఫలానా సినిమాల్లో బుక్ అయ్యానని ఆయన చెబుతుంటే మేము ఆశ్చర్యపోయేవాళ్లం. ఒకసారి ఆయనతో సినిమా చేసినవారు మళ్లీ ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపేవారు. అంత ఆకర్షణ శక్తి కృష్ణకి ఉండేది" అని చెప్పారు. 

"అప్పట్లో శోభన్ బాబు .. రామకృష్ణ ఇలా ఇతర హీరోలు ఉన్నప్పటికీ, కృష్ణతోనే నాకు ఎక్కువ అనుబంధం ఉండేది. పెద్ద హీరో కావాలనీ .. ఫారిన్ కారు కొనడమే తన కల అని కృష్ణ అంటూ ఉండేవాడు. అది అంత తేలికైన పనేం కాదు అని నేను అంటూ ఉండేవాడిని. కానీ చూస్తుండగానే ఆయన తాను అనుకున్నవి సాధిచాడు. పద్మాలయా .. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ లలో నేను 40 సినిమాలు చేశాను. నేనంటే కృష్ణ - విజయనిర్మలకు అంతటి అభిమానం" అంటూ చెప్పుకొచ్చారు.

Krishna
Chandra Mohan
Vijaya Nirmala
Tollywood
  • Loading...

More Telugu News