MS Dhoni: ఓ బర్త్ డే పార్టీలో హార్దిక్ పాండ్యాతో కలిసి ధోనీ స్టెప్పులు... వీడియో ఇదిగో!

Dhoni dance hungama with Hardik Pandya

  • దుబాయ్ లో పార్టీ
  • హాజరైన ధోనీ, పాండ్యా బ్రదర్స్
  • బాలీవుడ్ హిట్ సాంగ్స్ కు రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన వైనం
  • వీడియో వైరల్

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పబ్లిక్ లైఫ్ లో కనిపించడం చాలా తక్కువ. అయితే దుబాయ్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో ధోనీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. గందీ బాత్, ఢిల్లీ వాలీ గాళ్ ఫ్రెండ్ వంటి బాలీవుడ్ పాటలకు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో కలిసి ధోనీ హుషారుగా స్టెప్పులేశాడు. 

భార్య సాక్షితో కలిసి డీసెంట్ గెటప్ లో ఈ పార్టీకి వచ్చిన ధోనీ... డీజే మ్యూజిక్ కు కుర్రాళ్లకు దీటుగా ఊగిపోయాడు. ఈ బర్త్ డే పార్టీలో హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా, యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా హాజరయ్యారు. ఇండియన్ పాప్ సింగర్ బాద్షా ఈ వేడుకలో ఉర్రూతలూగించాడు.

MS Dhoni
Hardik Pandya
Dance
Birthday Party
Dubai

More Telugu News