meerut: క్లాసు రూములో మహిళా టీచర్ ను వేధించిన విద్యార్థులు

Students harass teacher in Meerut school

  • లైంగికంగా వేధిస్తూ వీడియో తీసిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీచర్
  • ఉత్తరప్రదేశ్ లోని మీరట్ స్కూలులో దారుణం

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించే గురువునే వేధింపులకు గురిచేశారు కొందరు విద్యార్థులు. మహిళా టీచర్ ను అసభ్యకరంగా కామెంట్ చేస్తూ వీడియో తీశారు. క్లాస్ రూంలో వేధింపులకు పాల్పడుతున్న విద్యార్థులను ముందు హెచ్చరించిన టీచర్.. వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీరట్‌ లోని ఓ స్కూల్లో మహిళా టీచర్ పై ముగ్గురు విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. క్లాస్‌రూమ్‌లో టీచర్‌ ఎదుట అసభ్యంగా ప్రవర్తించారు. వెకిలిగా మాట్లాడుతూ, అసభ్యకరంగా సైగలు చేస్తూ వీడియో తీశారు. అదే క్లాసులో ఉన్న విద్యార్థినులు ఈ తతంగాన్ని చూస్తూ నవ్వుకున్నారు. విద్యార్థుల తీరుతో విసిగి పోయిన టీచర్.. కోపంతో క్లాస్ రూంలో నుంచి వెళ్లిపోయారు. అయినా సదరు విద్యార్థులు వెంటపడి మరీ వేధించారు. తొలుత టీచర్ ఆ ముగ్గురినీ హెచ్చరించారు. అయినా వినకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

క్లాస్ రూంలో ముగ్గురు మైనర్ విద్యార్థులు తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ విద్యార్థి సోదరి కూడా ఈ వేధింపులకు మద్దతుగా నిలిచిందని అందులో పేర్కొన్నారు. టీచర్ ఫిర్యాదు మేరకు మైనర్ విద్యార్థులపై సంబంధిత సెక్షన్ల మేరకు కేసు నమోదు చేసినట్లు మీరట్ ఎస్పీ కేశవ్ కుమార్ మీడియాకు తెలిపారు.

meerut
class room harasment
teacher
students
police case
  • Loading...

More Telugu News