Naresh: నరేశ్ మూడో భార్య రమ్యపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు

Pavitra Lokesh police complaint on Naresh third wife Ramya

  • తన వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదు
  • పరువుకి భంగం కలిగిస్తున్నారన్న పవిత్ర
  • యూట్యూబ్ ఛానళ్ల వెనుక కూడా రమ్య ఉందని ఆరోపణ

టాలీవుడ్ లో ప్రస్తుతం నరేశ్, పవిత్రా లోకేశ్ ల బంధంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలు యూట్యూబ్ ఛానళ్లపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నరేశ్ మూడో భార్య రమ్యపై కూడా ఆమె ఫిర్యాదు చేశారు. 

తన వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని... తన పరువుకి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రమ్య ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో ఉందని అన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ల వెనుక రమ్య ఉందని ఆరోపించారు. గతంలో కూడా ఆమె తనపై దాడికి యత్నించిందని చెప్పారు. గతంలో ఓ హోటల్ రూమ్ లో నరేశ్, పవిత్ర ఉండగా రమ్య వచ్చి పెద్ద గొడవ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ ఘటన కలకలం రేపింది. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు కూడా నరేశ్, పవిత్ర కలిసే కనిపించారు.

Naresh
Pavitra Lokesh
Third Wife
Ramya
  • Loading...

More Telugu News