Allu Arjun: అర్ధాంగితో కలిసి చింతపల్లి గ్రామానికి వచ్చిన అల్లు అర్జున్

Allu Arjun at Chintapalli village

  • నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలో బన్నీ 
  • భార్య తరఫు బంధువుల ఇంటికి వచ్చిన వైనం
  • భారీగా తరలివచ్చిన అభిమానులు
  • అందరికీ అభివాదం చేసిన బన్నీ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామానికి విచ్చేశారు. ఆయన తన అర్ధాంగి స్నేహారెడ్డితో కలిసి చింతపల్లి చేరుకున్నారు. తన భార్య స్నేహారెడ్డి తరఫు బంధువు మరణించడంతో, వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బన్నీ వచ్చినట్టు తెలిసింది. 

కాగా, తమ అభిమాన హీరో వచ్చాడని తెలుసుకున్న అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు పోటీపడ్డారు. రోడ్డుకిరువైపులా నిలబడి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అల్లు అర్జున్ కూడా అందరికీ చేయి ఊపుతూ వాహనంలో ముందుకెళ్లారు.

Allu Arjun
Chintapalli
Sneha Reddy
Nalgonda District
Telangana
  • Loading...

More Telugu News