Pawan Kalyan: తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ

Pawan Kalyan met Thutpu Kapu leaders

  • మంగళగిరి వచ్చిన పవన్ కల్యాణ్
  • తూర్పు కాపు నేతలకు దిశానిర్దేశం
  • బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల అంశంపై చర్చ

ఇప్పటం గ్రామ రైతులకు ఆర్థికసాయం అందించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ నేడు మంగళగిరి చేరుకున్నారు. ఈ సాయంత్రం ఆయన తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీలోని కులాల పరిస్థితులు, ఉత్తరాంధ్ర జిల్లాల మినహా మిగతా జిల్లాల్లో తూర్పు కాపులకు బీసీ రిజర్వేషన్ సర్టిఫికెట్ల జారీలో ఇబ్బందులపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా పవన్ ప్రసంగించారు. 

తూర్పు కాపుల విషయానికొస్తే.... ఒక మంత్రి, ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకింత ఇబ్బంది పడుతున్నాం? అని అన్నారు. తెలంగాణలో అక్కడి ప్రభుత్వ ప్రమాణాలను బట్టి రిజర్వేషన్ స్టేటస్ తీసేశారంటే ఓ అర్థం ఉంది... కానీ ఇక్కడ ఏపీలో మూడు జిల్లాల్లోనే స్టేటస్ ఇచ్చి, మిగతా 10 జిల్లాల్లో తూర్పు కాపులను గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఉత్తరాంధ్ర నుంచి తూర్పు కాపులు అన్ని జిల్లాలకు వలస వెళ్లారని, వారు ఎక్కడికి వెళ్లినా కులం మారదని, కానీ రాజకీయ ప్రాబల్యం ఉంటే తప్ప కుల సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి లేదని వివరించారు. 

"తూర్పు కాపులకు మూడు జిల్లాల్లోనే ఓబీసీ సర్టిఫికెట్ ఎందుకు అమలు చేస్తున్నారు, మిగతా జిల్లాల్లో ఎందుకు ఇవ్వడంలేదు? ఇది మిగతా కులాలకు వర్తింపజేయకుండా కేవలం తూర్పు కాపులకే ఎందుకు వర్తింపజేస్తున్నారు?... ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా డిఫాక్టో ముఖ్యమంత్రి సజ్జల గారు దీనిపై వివరణ ఇవ్వాలి" అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Pawan Kalyan
Thurpu Kapu Leaders
Janasena
Mangalagiri
  • Loading...

More Telugu News