Brahmanandam: రష్మిక చేతుల మీదుగా 'పంచతంత్రం' ట్రైలర్ రిలీజ్

Panchatantram trailer released

  • ఐదు జీవితాల చుట్టూ తిరిగే 'పంచతంత్రం'
  • దర్శకత్వం వహించిన హర్ష పులిపాక 
  • నిర్మాతగా అఖిలేశ్ వర్ధన్ 
  • డిసెంబర్ 9వ తేదీన సినిమా రిలీజ్

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల జోరు మరింత పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న ఈ తరహా సినిమాలు, కంటెంట్ ఉంటే చాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నాయి. చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలా థియేటర్స్ కి రానున్న మరో చిన్న సినిమానే 'పంచతంత్రం'.అఖిలేశ్ వర్ధన్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ విహారి - శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ వదిలారు. రష్మిక చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఐదు కుటుంబాలు .. ఐదు జీవితాల సమాహారంగా ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.  

కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించిన ఈ సినిమాకి, సందీప్ రాజ్ సంభాషణలు సమకూర్చాడు. బ్రహ్మానందం .. సముద్రఖని .. దివ్యవాణి ..  రాహుల్ విజయ్ .. 'కలర్స్' స్వాతి .. శివాత్మిక .. దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించారు. డిసెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News