Andhra Pradesh: ఏపీలో పోలీస్ ఉద్యోగాల భర్తీ.. ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్!

police job notification in andrapradesh

  • రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం జగన్ తీపికబురు
  • పోలీస్ శాఖలో 6511 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
  • ఇందులో 6 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులే 

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిరుద్యోగులకు తీపి కబురు చెబుతూ.. రాష్ట్రంలోని 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. నియామక ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఒకటీ రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం. డిసెంబర్ లో దరఖాస్తులు స్వీకరించి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

ఖాళీల వివరాలు..
1. సివిల్ ఎస్సై పోస్టులు - 387
2. ఏపీఎస్పీ ఎస్సై పోస్టులు - 96
3. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు - 3508
4. ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు -2520

అర్హతలు..
  • ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి.

Andhra Pradesh
police jobs
notification
cm jagan
conistable posts
  • Loading...

More Telugu News