Dil Raju: నా స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కడికో వెళ్లిపోతే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను: దిల్ రాజు

Dil Raju interesting comments

  • సినిమా రంగంతో తనకు గుర్తింపు వచ్చిందన్న దిల్ రాజు 
  • రియల్ ఎస్టేట్ లో తన స్నేహితులు కోట్లు సంపాదించారని వివరణ
  • సిగ్గు, నీతి, మానం లేనిదే సినిమా అంటూ వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రోమో ఆన్ లైన్ లో సందడి చేస్తోంది. సినిమా రంగంలోకి రావడం వల్ల తనకు గుర్తింపు వచ్చి ఉండొచ్చని, కానీ తన స్నేహితులు రియల్ ఎస్టేట్ రంగంలో కోట్లు సంపాదిస్తుంటే, తాను మాత్రం ఇక్కడే ఆగిపోయానని దిల్ రాజు అన్నారు. తన స్నేహితులతో పోల్చితే ఆర్థికంగా తాను దిగువస్థాయిలో ఉన్నట్టే లెక్క అని తెలిపారు. 

ఇక సొంత సినిమాలకు తప్ప వేరే సినిమాలకు థియేటర్లు ఇవ్వడని తనపై వస్తున్న ప్రధాన ఆరోపణలకు కూడా బదులిచ్చారు. తన వద్ద ఉన్నది 37 థియేటర్లేనని, వాటితో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నానని అనడం సరికాదని దిల్ రాజు పేర్కొన్నారు. 

చిత్ర పరిశ్రమ అంతా ఓ కుటుంబం అని చెబుతుంటారని, కానీ అది పేరుకేనని, ఇక్కడ కలిసి నడవడం అనేది ఉండదని వివరించారు. అంతేకాదు, సినిమా అనే మూడక్షరాలకు తనదైన శైలిలో నిర్వచనం చెప్పారు. సిగ్గు, నీతి, మానం లేనిదే సినిమా అని అభివర్ణించారు.

Dil Raju
Comments
Interview
Tollywood

More Telugu News