Balakrishna: 'వీరసింహారెడ్డి' నుంచి 'జై బాలయ్య' మాస్ సాంగ్ విడుదల.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట!

Jai Balayya from Balakrishnas Veera Simha Reddy is out

  • బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' చిత్రం
  • సంగీతాన్ని అందించిన థమన్
  • 2023 సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న సినిమా

నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ 'జై బాలయ్య' పాటను విడుదల చేశారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, కరీముల్లా పాడారు. 

వైట్ అండ్ వైట్ డ్రెస్ లో, మీసం మెలేసి, మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్ తో బాలయ్య లుక్ అదిరిపోయేలా ఉంది. 'రాజసం నీ ఇంటి పేరు... పౌరుషం నీ ఒంటి పేరు' అంటూ మొదలైన ఈ పాట ఆద్యంతం చాలా పవర్ ఫుల్ గా ఉంది. థమన్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాట విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. అదిరిపోయే రేంజ్ లో ఉన్న ఈ పాటను చూసి బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే అని అంటున్నారు. 

రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలయ్య సరసన శ్రుతిహాసన్ నటిస్తుండగా.... కన్నడ నటుడు దునియా విజయ్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, కేజీఎఫ్ అవినాశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. 

Balakrishna
Veera Simha Reddy
Song
Jai Balayya
Tollywood

More Telugu News