LIC: ఇంటర్ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు.. వివరాలు ఇవిగో!

jobs in LIC with inter qualification

  • పార్ట్ టైమ్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఉద్యోగాలు
  • రెండు విభాగాల్లో రెండొందల ఖాళీలు
  • డిగ్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇంటర్, డిగ్రీ అర్హతతో మంచి ఉద్యోగం సంపాదించాలని చూస్తున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) శుభవార్త చెప్పింది. పార్ట్ టైమ్ ఏజెంట్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఖాళీల భర్తీని చేపట్టేందుకు ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు విభాగాలలో రెండొందల ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. ఇంటర్, డిగ్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పార్ట్ టైమ్ ఏజెంట్ గా నియమితులైన వారికి రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు, ఇన్సూరెన్స్ అడ్వైజర్లకు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు జీతంగా చెల్లించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఉద్యోగ ఖాళీలు.. పార్ట్ టైమ్ ఏజెంట్: 100, పార్ట్ టైమ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్: 100

అర్హతలు:
పార్ట్ టైమ్ ఏజెంట్: 12వ తరగతి ఉత్తీర్ణత. పార్ట్ టైమ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ (బ్యాచిలర్స్ డిగ్రీ). 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ 

దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు 2 డిసెంబర్ 2022 లోగా  www.ncs.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

LIC
jobs
parttime agent
insurence adviser
  • Loading...

More Telugu News