: వేములవాడ దేవాలయంలో అపచారం
కరీంనగర్ జిల్లాలో సుప్రసిద్ధ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. భారీ ఈదురుగాలులకు ధ్వజస్తంభం విరిగిపోయింది. 30 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం విరిగిపడడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో దేవాలయ అధికారుల నిర్లక్ష్యం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.