Chaitu: చైతూ 22వ సినిమా టైటిల్ ఖరారు .. పోస్టర్ రిలీజ్!

Custody Movie Title Poster Released

  • షూటింగు దశలో చైతూ 22వ సినిమా 
  • తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా 
  • 'కస్టడీ' టైటిల్ ను ఖరారు చేసిన టీమ్ 
  • కథానాయికగా అలరించనున్న కృతి శెట్టి 

నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను ఈ రోజున రివీల్ చేయనున్నట్టు, నిన్ననే ప్రీ లుక్ పోస్టర్ ద్వారా చెప్పారు. 

అదే విధంగా కొంతసేపటి క్రితం టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'కస్టడీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. పోలీస్ అధికారులు హీరోను చుట్టుముట్టి కస్టడీలోకి తీసుకుంటున్నట్టుగా పోస్టర్ లో కనిపిస్తోంది. అయితే హీరో కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండటమే ఇక్కడి విశేషం. 

ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. చైతూతో ఆమె చేస్తున్న రెండో సినిమా ఇది. ఇక అరవింద్ స్వామి .. శరత్ కుమార్ .. ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 'థ్యాంక్యూ' ఫలితంతో నిరాశలో ఉన్న చైతూకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

Chaitu
Krithi Shetty
Aravind Swami
Custody Movie
  • Loading...

More Telugu News